భద్రాద్రి రామయ్య కల్యాణానికి 8 కేజీల గోటి తలంబ్రాలు!
- నేడు శ్రీరామ నవమి
- శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు
- గోటి తలంబ్రాలు అందించిన అనంత పద్మనాభ కోలాట భక్తబృందం
మొత్తం 50 కిలోల వడ్లు రాగా, వాటిని రఘునాథపాలెం, వీఆర్‌బంజర, చింతపల్లి, కోయచెలక, రేగులచెలక, గణేశ్వరం, కోటపాడు, భయన్నపాడు, ఆంధ్రప్రదేశ్‌లోని గూడవల్లి, చెరుకుపల్లి గ్రామాలకు ఉచితంగా పంచిపెట్టారు. అలాగే, గోటితో ఒలిచిన 8 కిలోల తలంబ్రాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సమర్పించారు. రాములోరి కల్యాణంలో ఈ గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు.