ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న జగన్.. 14 రోజుల వ్యవధిలో హస్తినకు రెండోసారి!
- మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి బయల్దేరుతున్న జగన్
- రేపు మోదీ, అమిత్ షాలను కలవనున్న ముఖ్యమంత్రి
- ఈనెల 16న కూడా ఢిల్లీకి వెళ్లిన సీఎం
గత 14 రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండటం ఇది రెండోసారి. ఈ నెల 16న ఆయన ఢిల్లీకి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలను కూడా పక్కన పెట్టి ఆయన అప్పుడు ఢిల్లీకి వెళ్లారు. 17న మోదీ, అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి చర్చించడానికే ఢిల్లీకి వెళ్లానని జగన్ చెప్పారు. ఇప్పుడు విశాఖలో జీ-20 సదస్సు జరుగుతున్న తరుణంలో ఆ కార్యక్రమాన్ని పక్కనపెట్టి ఢిల్లీకి వెళ్తుండటంపై ఆసక్తి నెలకొంది. జగన్ కు మోదీ, అమిత్ షా ల అపాయింట్ మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.