లేడీ పోలీసాఫీసర్ ను పెళ్లి చేసుకున్న పంజాబ్ మంత్రి

AAP minister Harjot Singh Bains marries IPS Jyoti Yadav
  • ఓ ఇంటివాడైన పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్
  • ఎస్పీ జ్యోతి యాదవ్ తో ఘనంగా వివాహం
  • హాజరైన ఆప్ ప్రముఖులు
పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ వార్తల్లోకెక్కారు. ఆయన నిన్న ఓ ఇంటివాడయ్యారు. ఆయన పెళ్లి చేసుకుంది ఓ లేడీ పోలీసాఫీసర్ ను కావడం విశేషం. ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్ తో హర్జోత్ సింగ్ బైన్స్ వివాహం శనివారం ఓ గురుద్వారాలో ఘనంగా జరిగింది. 

హర్జోత్ సింగ్ బైన్స్ పంజాబ్ ఆప్ మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కుడు. ఆయన వయసు 32 ఏళ్లు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. జ్యోతి యాదవ్ ఇటీవలే మాన్సా జిల్లాకు ఎస్పీగా నియమితులయ్యారు. హర్జోత్ సింగ్ బైన్స్ రూప్ నగర్ జిల్లాలోని ఆనందపూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వృత్తి రీత్యా హర్జోత్ సింగ్ న్యాయవాది. 

ఇక, ఎస్పీ జ్యోతి యాదవ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే... ఆమె స్వస్థలం హర్యానాలోని గురుగ్రామ్. ఆమె గతేడాది ఆప్ ఎమ్మెల్యే రాజిందర్ పాల్ కౌర్ తో పబ్లిక్ లో వాగ్యుద్ధం పెట్టుకుని వార్తల్లోకెక్కింది. మంత్రి హర్జోత్, ఎస్పీ జ్యోతి యాదవ్ లకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. నిన్న జరిగిన వీరి పెళ్లికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖులు హాజరై ఆశీస్సులు అందించారు.
Go Back to Shorts
Harjot Singh Bains
Minister
Jyoti Yadav
IPS
AAP
Punjab

More Telugu News