వంట గ్యాస్ పై సబ్సిడీని మరో ఏడాది పొడిగించిన కేంద్రం
- పీఎంయూవై లబ్దిదారులకు సిలిండర్ పై రూ.200 తగ్గింపు
- సబ్సిడీ మొత్తాన్ని నేరుగా బ్యాంకులో జమ చేయనున్న ప్రభుత్వం
- ఏడాదికి 12 సిలిండర్లకే సబ్సిడీ వర్తిస్తుందని వెల్లడి
నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ఉజ్వల యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మహిళలకు ఎల్పీజీ కనెక్షన్ సదుపాయం కల్పించింది. వారికి ఏటా 12 సిలిండర్లను సబ్సిడీపై అందజేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లు ఈ సబ్సిడీ అందజేస్తున్నాయి.