కోవిడ్ పేషెంట్లకు అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడొద్దు.. కేంద్రం సూచన
- ఇటీవల మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
- కరోనా బారిన పడిన పెద్దలకు పలు మందులు వాడొద్దని సూచన
మరోవైపు కోవిడ్ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్-రిటోనావిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఐవెర్మెక్టిన్, మోల్నుపిరవిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ ఔషధాలు వినియోగించవద్దని ఆదేశాలిచ్చింది. ప్లాస్మా థెరఫీ కూడా చేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది.
వ్యాధి తీవ్రత మధ్యస్తంగా లేదా తీవ్రంగా ఉంటే, రోగి ఆక్సిజన్ సహాయంతో ఉంటే ఐదు రోజుల పాటు రెమెడిసివిర్ వాడొచ్చని పేర్కొంది. అయితే వ్యాధి లక్షణాలు ప్రారంభమైన 10 రోజుల్లోపే వినియోగించాలని, ఐఎంవీ, ఎక్మో మీద ఉన్న వారికి ఇవ్వొద్దని సూచించింది. ఐసీయూలో చేర్చిన 24-48 గంటల్లో టోసిలిజుమాబ్ వినియోగించవచ్చని సూచించింది.