టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. రేణుక భర్తపై ప్రభుత్వం వేటు
- రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం
- కీలక సూత్రధారి రేణుక, ఆమె భర్త ఇప్పటికే అరెస్ట్
- ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్యా నాయక్
- తొలగిస్తూ డీఆర్డీఏ ఉత్తర్వులు
ఈ కేసులో భార్యాభర్తలైన రేణుక, డాక్యానాయక్పై ఇప్పటికే కేసు నమోదైంది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డాక్యా నాయక్ జైలులో ఉండడంతో ఉత్తర్వులు ఆయనకు అందించే వీలు లేకుండా పోయింది. దీంతో గండీడ్ మండలం పంచాంగల్ తండాలోని ఆయన కుటుంబ సభ్యులకు వాటిని అందజేశారు.