కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి అథియా పోస్ట్
- ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన రాహుల్
- 75 పరుగులతో నాటౌట్ గా నిలిచిన వైనం
- అత్యంత దృఢమైన వ్యక్తి అని కొనియాడిన అథియా
భారత్ ను విజయతీరాలకు చేర్చిన రాహుల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన భార్య అథియా శెట్టి కూడా రాహుల్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తనకు తెలిసిన అత్యంత దృఢమైన వ్యక్తికి ప్రేమతో అంటూ హార్ట్ ఎమోజీని పెట్టింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురే అథియా శెట్టి. చాలా కాలంగా ప్రేమలో ఉన్న రాహుల్, అథియాలు పెద్దల అంగీకారంతో జనవరి 24న పెళ్లి చేసుకున్నారు.