ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశంసలు
- ఈరోజు మొదలైన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు
- అసెంబ్లీలో ప్రసంగించిన లెఫ్టినెంట్ గవర్నర్
- విద్యా రంగాన్ని మెరుగు పరచడంపై ఆప్ ప్రభుత్వం దృష్టి సారించిందని కితాబు
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అసెంబ్లీలో ప్రసంగించారు. ఢిల్లీలోని ఆసుపత్రులను నవీకరిస్తున్నారని... దీనికితోడు కొత్త ఆసుపత్రులలో అదనంగా 16 వేల బెడ్స్ చేరుతాయని చెప్పారు. వాస్తవానికి ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే అసెంబ్లీలో గవర్నర్ చేసే ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రూపొందిస్తుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రసంగంలో ఆప్ ప్రభుత్వాన్ని లెప్టినెంట్ గవర్నర్ పొగడాల్సి వచ్చింది.