సరికొత్త ఐఫోన్ 15 ప్రో గురించి కీలక విషయాల లీక్
- ఈ ఏడాది చివర్లో రానున్న కొత్త మోడల్
- సరికొత్త ఫీచర్లు, అప్డేట్స్ తో అందుబాటులోకి
- ధర కూడా భారీగా పెరుగుతుందంటున్న టెక్ నిపుణులు
అలాగే, ఖరీదైన ప్రొ వేరియంట్లు మెరుగైన ర్యామ్, టైటానియం ఫ్రేమ్‌తో అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ఫోన్లలో యాపిల్ అధునాత ఏ17 బయోనిక్ చిప్‌సెట్‌ను వాడనుంది. ఈ ఫీచర్లు, అప్‌డేట్ల కారణంగా రాబోయే ఐఫోన్ల ధరలు అధికంగా ఉండనున్నాయి. పాత మోడల్‌తో పోల్చితే యాపిల్ ఐఫోన్ 15 ఆల్ట్రా ధరను 200 డాలర్ల వరకు పెంచుతారని తెలుస్తోంది. వీటి ధర 1,299 డాలర్లుగా ఉంటుందని, భారత కరెన్సీలో రూ. 1,07,330 సమాచారం. భారత మార్కెట్‌లోకి వచ్చేసరికి కస్టమ్స్, ఇతర పన్నులు కలుపుకొని ధర మరింత పెరగనుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ భారత్ లో రూ. 1,39,900 ధరతో ప్రారంభమైంది. ఈ లెక్కన ఐఫోన్ 15 ఆల్ట్రా కనీసం లక్షన్నర ధరతో మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.