జులైలో విశాఖకు తరలి వెళుతున్నాం: సీఎం జగన్
- సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
- విశాఖకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారు
- విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని మంత్రులతో చెప్పిన వైనం
సీఎం జగన్ విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ, ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించడం తెలిసిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.