గోవా పర్యటనకు వెళ్లిన కుటుంబంపై కత్తులతో దాడి!
- సోషల్ మీడియాలో వివరాలను వెల్లడించిన బాధిత కుటుంబం
- ఘటనపై గోవా ముఖ్యమంత్రి సీరియస్
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు
దుండగులు ఆ కుటుంబంపై దాడి చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జతిన్‌పై దాడి జరుగుతున్న సమయంలో ఓ మహిళ తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఇక గోవా ముఖ్యమంత్రి డా.ప్రమోద్ సావంత్ ఈ దాడిని ఖండించారు. దీని వెనుక కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘‘దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించా’’ అని ఆయన ట్వీట్ చేశారు.