బండి సంజయ్ కి అక్కాచెల్లెళ్లు లేరా?: మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy fires on Bandi Sanjay
  • ఈడీ విచారణకు వెళ్లిన కవిత
  • కవితపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
  • వాడో మెంటల్ సంజయ్ అంటూ మల్లారెడ్డి ఆగ్రహం
  • ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని స్పష్టీకరణ
లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ కాదు, వాడొక మెంటల్ సంజయ్ అంటూ విమర్శించారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ వ్యాఖ్యలు ఏ విధంగానూ సమంజసం కాదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ కు అక్కాచెల్లెళ్లు లేరా? అని నిలదీశారు. 

రాబోయే ఎన్నికల్లో బీజేపీ వాళ్లకు కనీసం డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఇప్పటివరకు సింగిల్ డిజిట్ లో ఉన్నారని, ఇకపై అది జీరో అవుతుందని జోస్యం చెప్పారు. వాళ్లు ఏంచేసినా, ఎన్ని చేసినా మాకు కేసీఆరే హీరో అని మల్లారెడ్డి పేర్కొన్నారు.
Go Back to Shorts
Ch Malla Reddy
Bandi Sanjay
K Kavitha
ED
Delhi Liquor Scam

More Telugu News