పెరుగుతున్న గుండె జబ్బులు.. కారణం కరోనానేనా?
- వైరస్ నుంచి కోలుకున్న వారిలో ఛాతి, శ్వాసకోశ సమస్యలు
- ఇవి దీర్ఘకాలంలో హృద్రోగాలకు కారకాలు
- హార్వార్డ్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జరిపిన మరో అధ్యయనంలో.. 25 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులలో హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య 29.9 శాతం పెరిగిందని తేలింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నెలలు గడిచినా కూడా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, మైకం కమ్మడం తదితర సమస్యలు వీడడంలేదని పరిశోధకులు చెప్పారు. ఈ సమస్యలు గుండె జబ్బులకు కారణమవుతున్నాయని సందేహిస్తున్నట్లు తెలిపారు. అయితే, హృద్రోగ బాధితుల సంఖ్య పెరగడానికి ఇప్పటికైతే స్పష్టమైన కారణం తెలియదని, ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు.