కడుపు మంటతో రాసిన లేఖ.. గంటాపై గుడివాడ అమర్ నాథ్ మండిపాటు
- గతంలో దావోస్ కు వెళ్లి టీడీపీ నేతలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని గుడివాడ అమర్ నాథ్ ప్రశ్న
- దావోస్ కు వస్తున్న ప్రతినిధులనే తాము రాష్ట్రానికి తీసుకొస్తున్నామని వ్యాఖ్య
- ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపణ
అసలు ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని అమర్ నాథ్ ఆరోపించారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. ‘‘10 ఏళ్లకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. కానీ చంద్రబాబు పారిపోయి వచ్చారు. రాజధాని లేదని ఎలా అంటారు. వాళ్లకు మాట్లాడే అర్హతే లేదు’’ అని మండిపడ్డారు.
దావోస్ కు వెళ్లడం, అక్కడ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల గురించి చెప్పుకోవడం కాదని, దావోస్ కు వస్తున్న ప్రతినిధులనే రాష్ట్రానికి తీసుకొస్తున్నామని, ఏది గొప్ప? అని అమర్ నాథ్ ప్రశ్నించారు. కనీసం 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతకుమించి 5 లక్షల కోట్లు వస్తాయా? లేక 10 లక్షల కోట్లా? అనేది ఇన్వెస్టర్లను బట్టి ఉంటుందన్నారు.