ఐసీసీ ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్ర స్థానానికి వెళ్లిన రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin tops ICC test rankings
  • 864 పాయింట్లతో తొలి స్థానంలో అశ్విన్
  • 859 పాయింట్లతో రెండో స్థానంలో జేమ్స్ అండర్సన్
  • 8వ స్థానంలో ఆల్ రౌండర్ జడేజా
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్లను పడగొట్టడం ద్వారా అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. 

అశ్విన్ తొలిసారి 2015లో టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానానికి వెళ్లాడు. అప్పటి నుంచి పలుమార్లు టాప్ పొజిషన్ కు వెళ్లాడు. టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ లో అశ్విన్ 864 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... జేమ్స్ అండర్సన్ 859 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత ఆల్ రౌండర్ జడేజా 8వ స్థానంలో ఉన్నాడు.
Go Back to Shorts
Ravichandran Ashwin
ICC Test Rankings
Team India

More Telugu News