నాటు నాటుకు దక్షిణ కొరియా ఎంబసీ సిబ్బంది స్టెప్పులు.. స్పందించిన మోదీ
- ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాట
- పాటకు కాలు కదిపిన భారత్ లోని దక్షిణా కొరియా దౌత్య కార్యాలయ సిబ్బంది
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
53 సెకన్ల నిడివిగల క్లిప్‌లో దక్షిణ కొరియా రాయబార కార్యాలయ సిబ్బంది నాటు నాటుకు చాలా ఉత్సాహంతో నృత్యం చేశారు. వారితో దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బోక్ కూడా చేరారు. టీమ్ మొత్తం పాటలోని హుక్ స్టెప్ కూడా వేసింది. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ క్లిప్ భారత ప్రధాని మోదీ దృష్టిని కూడా ఆకర్షించింది. దీనిపై స్పందించిన ఆయన జట్టు ప్రయత్నాన్ని ప్రశంసించారు.