‘కస్టడీ’ నుంచి రిలీజ్​ అయిన నాగచైతన్య!

Naga Chaitanya Custody wraps production
  • గతేడాది హిట్ కొట్టలేకపోయిన చైతన్య
  • కస్టడీపై భారీ అంచనాలు పెట్టుకున్న అక్కినేని హీరో
  • తమిళ, తెలుగు భాషల్లో మే 12న విడుదల కానున్న చిత్రం
లవ్ స్టోరీ తర్వాత  మరో సక్సెస్ చూసి అక్కినేని నాగ చైతన్య చాన్నాళ్లు అవుతోంది. గతేడాది అతను హీరోగా నటించిన బంగార్రాజు, థ్యాంక్యూ చిత్రాలతో పాటు హిందీలో కీలక పాత్ర పోషించిన లాల్ సింగ్‌ చద్ధా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎలాగైనా మంచి హిట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు చైతన్య.  తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ‘కస్టడీ’ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన ప్రస్తుతం కృతిశెట్టి జంటగా నటిస్తోంది. బంగార్రాజు తర్వాత మరోసారి వీరు జంటగా కనిపిస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో చిత్ర బృందం షేర్ చేసింది. ఇందులో దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పాడు. అనంతరం యూనిట్ తో కలిసి  చైతన్య, కృతి శెట్టితో ‘మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్‌‌లో కలుద్దాం’ అని చెప్పారు. ఈ సినిమాలో తమిళ స్టార్ అరవింద్ స్వామి ప్రతినాయక పాత్ర పోషించగా, ప్రియమణి  మరో కీలక పాత్రలో నటించింది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Go Back to Shorts
Tollywood
Naga Chaitanya
movie
Krithi Shetty

More Telugu News