చంద్రబాబును జైల్లో లేదా పిచ్చాసుపత్రిలో పెట్టాలి: కొడాలి నాని
- పోలీసులను చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న కొడాలి నాని
- చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్టున్నాడని ఎద్దేవా
- పట్టాభిని గన్నవరంకు పంపింది చంద్రబాబేనని ఆరోపణ
నారా లోకేశ్ బ్రెయిన్ లెస్ కిడ్ అని... తన పిచ్చి వాగుడుని చంద్రబాబుకు అంటించినట్టున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఆయనకు బాలకృష్ణ పూనినట్టున్నాడని అన్నారు. గన్నవరంకు పట్టాభిని పంపింది చంద్రబాబేనని ఆరోపించారు. గన్నవరం ఘటనలో టీడీపీ కార్యకర్తలకు చిన్న గీత కూడా పడలేదని చెప్పారు. చంద్రబాబును జైల్లో కానీ లేదా పిచ్చాసుపత్రిలో కానీ పెట్టాలని అన్నారు.