'కాంతార 2'లో కనిపించనున్న రజనీకాంత్?
- రిషబ్ శెట్టి క్రేజ్ ను పెంచేసిన 'కాంతార'
- ప్రీక్వెల్ కోసం రంగంలోకి దిగిన హీరో
- పాన్ ఇండియా స్థాయి ఆర్టిస్టుల కోసం అన్వేషణ
- రజనీని ఒప్పించే ప్రయత్నంలో ఉన్న రిషబ్ శెట్టి
ఆ మధ్య రజనీకాంత్ కూడా రిషబ్ శెట్టిని తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఆ తరువాత ఈ సినిమాకి ప్రీక్వెల్ చెయ్యడానికి రిషబ్ శెట్టి రంగంలోకి దిగాడు. ఫస్టు పార్టుకి పాన్ ఇండియా స్థాయిలో రెస్పాన్స్ రావడం వలన, సెకండ్ పార్టును పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మించాలనే ఆలోచనలో రిషబ్ శెట్టి ఉన్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా దూసుకుని వెళ్లాలంటే ఆ స్థాయి తారాగణం కూడా అవసరం. అందువలన ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రలో రజనీకాంత్ కాసేపు కనిపిస్తే బాగుంటుందని భావించిన రిషబ్ శెట్టి, ఆయనను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడని అంటున్నారు. మరి రజనీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనేది చూడాలి.