5జీ ఫోన్ల ధరలు తగ్గించే దిశగా ట్రాయ్ కీలక నిర్ణయం
- 5జీ ఫోన్ల అధికధరలు డిజిటలీకరణకు అవరోధం కాకూడదన్న ట్రాయ్ చైర్మన్
- ధరల తగ్గుదలకు పలు సూచనలు చేస్తామని వెల్లడి
- త్వరలో కన్సల్టేషన్ పేపర్ విడుదల చేస్తామని ప్రకటన
‘‘2జీ, 3జీ ధరలు ఇప్పటికే బాగా తగ్గాయి. 4జీ ఫోన్ల ధరలూ అందుబాటులోకి వచ్చాయి. అయితే..5జీ ఫోన్ల ధరలు మాత్రం అధికంగా ఉన్నాయి. ఈ ఫోన్ల లభ్యత కూడా తక్కువగా ఉండటం మనముందున్న మరో సమస్య. వీటి పరిష్కారం కోసం త్వరలో ఓ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరుగుతున్నాయి. అయితే.. వీటి ధరలు అందరికీ అందుబాటులో లేకపోవడం ఓ ప్రధాన సమస్యగా ట్రాయ్ భావిస్తోంది. ప్రస్తుతం 5జీ ఫోన్ల సగటు ధర రూ.30 వేలు. రూ. 20 వేల లోపు ధరలకే ఇవి అందుబాటులో వస్తే దేశంలో డిజిటలీకరణ విస్తరించేందుకు, అక్షరాస్యత పెరిగేందుకు దోహద పడుతుందని నిపుణులు చెబుతున్నారు.