గూగుల్ పిక్సల్ కు పోటీగా వస్తున్న వివో వీ27
- మార్చి 1న విడుదల
- ట్విట్టర్ లో ప్రకటించిన వివో
- రూ.30వేల స్థాయిలో ధర ఉండొచ్చని అంచనా
- కర్వ్ డ్ డిస్ ప్లే, స్లీక్ డిజైన్
ప్రస్తుతం గూగుల్ పిక్సల్ 6ఏ ధర రూ.29,999 నుంచి మొదలవుతుంటే, వివో వీ27 ధర ఇంతకులోపు ఉండొచ్చని తెలుస్తోంది. వివో వీ27 ప్రీమియం డిజైన్ తో రానుంది. ఫొటోలు చూస్తే ఇదే తెలుస్తోంది. కర్వ్ డ్ డిస్ ప్లే, పంచ్ హోల్, స్లిమ్ డిజైన్ తో ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్ వోసీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివో ఇంకా ధరలు, స్పెసిఫికేషన్ల గురించి ప్రకటించలేదు. ప్రస్తుతం మన మార్కెట్లో వివో వీ25 అందుబాటులో ఉండగా, దీని ఆరంభ ధర రూ.27,999గా ఉంది. వీ27 ధర దీనికంటే ఎక్కువే ఉండే అవకాశాలున్నాయి.