మళ్లీ ప్రారంభమైన సీసీఎల్... అఖిల్ అక్కినేని పరుగుల సునామీ

Akhil Akkineni smashes Kerala bowling in CCL match
  • రాయ్ పూర్ లో మ్యాచ్
  • తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా అఖిల్ అక్కినేని
  • తొలి ఇన్నింగ్స్ లో 30 బంతుల్లో 91 పరుగులు
  • రెండో ఇన్నింగ్స్ లో 19 బంతుల్లో 65 పరుగులు
కరోనా సంక్షోభానికి ముందు విశేషంగా అలరించిన సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మళ్లీ ప్రారంభమైంది. రాయ్ పూర్ లో ఇవాళ తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరగ్గా... 64 పరుగుల తేడాతో తెలుగు వారియర్స్ నే విజయలక్ష్మి వరించింది. ఈ మ్యాచ్ లో హైలైట్ అంటే తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని విధ్వంసక ఇన్నింగ్సే. 

అఖిల్ తొలి ఇన్నింగ్స్ లో 30 బంతుల్లో 91... రెండో ఇన్నింగ్స్ లో 19 బంతుల్లో 65 పరుగులు చేశాడంటే అతడి ఊచకోత ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అఖిల్ సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించడంతో కేరళ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

ఈ పోరులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అఖిల్ నే వరించింది. ఈ అవార్డును అఖిల్... విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం అఖిల్ ట్వీట్ చేస్తూ, తమ జట్టు మాజీ ఆటగాడు నందమూరి తారకరత్నకు ఈ మ్యాచ్ విజయాన్ని అంకితం చేస్తున్నట్టు తెలిపాడు.
Go Back to Shorts
Akhil Akkineni
Telugu Warriors
Kerala Strikers
CCL
Raipur

More Telugu News