భారతీయ రైళ్లకు పేరు ఎలా పెడతారో తెలుసా..? 

How do Indian Railways trains get their names
భారతీయ రైల్వే పలు ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లకు పేర్లు పెడుతుంటుంది. అసలు ఈ పేర్లను ఎలా నిర్ణయిస్తారన్నది ఆసక్తికరం. చాలా మందికి దీని గురించి తెలియదు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కావడం గమనార్హం.

సాధారణంగా రైల్వేలకు వాటి గమ్యస్థానాల పేర్లనే పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇతర పేర్లను కూడా ఖరారు చేస్తారు. రైలు ప్రయాణించే ప్రాంతాల్లో వాడుకలోని కొన్ని పేర్లు కూడా పెడుతుంటారు. ఉదాహరణకు శతాబ్ది ఎక్స్ ప్రెస్ అన్నది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా 1989లో మొదలైంది. అందుకే దీనికి శతాబ్ది అని పేరు పెట్టారు. భారతీయ రైల్వే నిర్వహించే దూర ప్రాంత రైలు ఇది.

ఇక రాజధాని ఎక్స్ ప్రెస్ అంటూ దేశ రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు నడిచే రైళ్లకు పెట్టారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి రాష్ట్రాల రాజధానుల మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. అందుకే రాజధాని పేరు సరిగ్గా ఉంటుందని అలా ఖరారు చేశారు. ఇక దురంతో ఎక్స్ ప్రెస్ పేరును గమనిస్తే.. దురంతో అంటే అవాంతరాలు లేనిది. హైదరాబాద్ నుంచి త్రివేండ్రమ్ మధ్య రైలుకు శబరి ఎక్స్ ప్రెస్ పేరు. శబరిమల వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు అనుకూలం. అందుకని శబరి పేరు పెట్టారు. ఇలా ప్రత్యేకమైన పేర్లు చాలా తక్కువగానే ఉంటాయి. ఎక్కువ శాతం గమ్యస్థానం పేర్లు నిర్ణయిస్తుంటారు.
Go Back to Shorts
Indian Railways
TRAIN NAMES
meanings

More Telugu News