Kiran Abbavaram: ప్రతి క్రిమినల్ కి ఒక వీక్ నెస్ ఉంటుంది: 'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మరో ట్రైలర్

Vinaro Bhagyamu Vishnu katha trailer released
షార్ట్స్‌లో చూడండి
గతంలో తిరుపతి నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాగే 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా కూడా తిరుపతి నేపథ్యంలోనే నడుస్తుంది. కిరణ్ అబ్బవరం - కశ్మీర పరదేశి జంటగా నటించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించగా, దర్శకుడిగా కిశోర్ పరిచయమవుతున్నాడు.

ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. రేపు ఈ సినిమా రిలీజ్ అవుతుండగా, కొంతసేపటి క్రితం మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'ప్రతి క్రిమినల్ కి ఒక వీక్ నెస్ ఉంటుంది' అనే డైలాగ్ కిరణ్ పాత్రపై కుతూహలాన్ని పెంచుతోంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఆమని .. శుభలేఖ సుధాకర్ .. మురళీశర్మ .. ఎల్బీ శ్రీరామ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. వరుస ఫ్లాపులతో ఉన్న కిరణ్ ను ఈ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందనేది చూడాలి మరి.

Go Back to Shorts
Kiran Abbavaram
Kashmira Paradeshi
Vinaro Bhagyamu Vishnu Katha Movie

More Telugu News