మెగాస్టార్ కి అరవింద్ గారిలా .. బన్నీకి బన్నీవాసు ఉన్నారు: డైరెక్టర్ బాబీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగాస్టార్ కి అరవింద్ గారిలా .. బన్నీకి బన్నీవాసు ఉన్నారు: డైరెక్టర్ బాబీ

Vinaro Bhagyamu Vishnu katha pre release event
  • బన్నీ వాసు నిర్మాణంలో 'వినరో భాగ్యము విష్ణు కథ'
  • కిరణ్ అబ్బవరం జోడీగా కశ్మీర పరదేశి
  • బన్నీ వాసుని అభినందించిన డైరెక్టర్ బాబీ 
  • ఈ నెల 18న విడుదలవుతున్న సినిమా  
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా రూపొందింది. ఈ నెల 18వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వేడుకకి హాజరైన డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. "కోలీవుడ్ లో శివ కార్తికేయన్ మాదిరిగా, తెలుగులో కిరణ్ అబ్బవరం ఎదుగుతుండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది" అని చెప్పారు. 

సాధారణంగా ఎవరైనా సరే హీరో కావాలనో.. డైరెక్టర్ కావాలనో ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ అల్లు అరవింద్ గారిలా నిర్మాత కావాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిగా బన్నీ వాసును చూస్తున్నాను. తాను నిర్మాత కావడమే కాకుండా కొత్త వాళ్లకి అవకాశాలిస్తూ వెళ్లడం ఆయన ప్రత్యేకతగా కనిపిస్తోంది" అన్నారు. 

"నేను చదువుకునే రోజుల్లో .. చిరంజీవిగారి దగ్గరికి ఏ సమస్య వెళ్లకుండా అరవింద్ గారు చూసుకుంటూ ఉంటారు అని చెప్పుకుంటూ ఉండేవారు. అలా ఇప్పుడు బన్నీగారి విషయంలో బన్నీ వాసు కనిపిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.
Advertisement
Kiran Abbavaram
Kashmira paradeshi
Bunny Vasu
Bobby

More Telugu News