ఒక్క ఏడాది హేడ్లీని మాకప్పగించండి: భారత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక్క ఏడాది హేడ్లీని మాకప్పగించండి: భారత్

ముంబై పేలుళ్ల కీలక నిందితుడు డేవిడ్ హేడ్లీని విచారణ నిమిత్తం ఒక్క ఏడాది అప్పగించాలని అమెరికాను భారత్ కోరింది. ఒక దేశం నుంచి మరో దేశానికి ఖైదీల బదిలీ సాధ్యం కాదని అమెరికా తేల్చి చెప్పినా, భారత్ తమకు తాత్కాలికంగా ఒక్క ఏడాదికి మాత్రమే అప్పగించాలని కోరింది. విచారణ పూర్తి చేసుకుని తరువాత అప్పగిస్తామని పేర్కొంది. ఆ విజ్ఞప్తికి అమెరికా అంగీకరించే అవకాశం ఉందని భారత దౌత్యవేత్తల నమ్మకం. హేడ్లీ విచారణ పూర్తి చేసుకుంటే ఈ పేలుళ్ల వెనుక ఎవరెవరున్నది బయటపడే అవకాశం ఉంది. దీనికి తోడు పాకిస్తాన్ ను అంతర్జాతీయ ముద్దాయిగా నిలబెట్టవచ్చు అన్నది భారత్ ఆలోచన. దీనికి హేడ్లీ విచారణ సరిపోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

More Telugu News