నేడు తెలంగాణలో పర్యటించనున్న పంజాబ్ సీఎం
- జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న పంజాబ్ సీఎం
- మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించనున్న భగవంత్ మాన్
- చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్ ల నిర్మాణాలను అధ్యయనం చేయనున్న సీఎం
భూగర్భ జలాలను పరిరక్షించేందుకు కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులను భగవంత్ మాన్ బృందం పరిశీలించనుంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్ ల నిర్మాణం తదితర పనులను అధ్యయనం చేయనున్నారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగిరానున్నారు.