సీఎం జగన్ ను కలిసిన ఆస్ట్రేలియా ఎంపీలు
- ఏపీ పర్యటనకు విచ్చేసిన ఆస్ట్రేలియా ఎంపీల బృందం
- సీఎం జగన్ తో పలు అంశాలపై చర్చ
- ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించిన ఎంపీలు
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఎంపీలు లీ టార్లామిస్, మాథ్యూ ఫ్రేగాన్ మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ ను కలవడం సంతోషదాయకమని, పరస్పర ఆలోచనలు, లక్ష్యాల గురించి చర్చించామని వెల్లడించారు. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ఆస్ట్రేలియాలో తాము ఆశిస్తున్న లక్ష్యాల్లో సారూప్యత కనిపిస్తోందని వారు అభిప్రాయపడ్డారు. గతేడాది ఏపీ ప్రజాప్రతినిధులు ఆస్ట్రేలియాలో పర్యటించడం తెలిసిందే.