కోకకోలా డిజైన్ తో రియల్ ఫోన్ విడుదల
- ఈ నెల 14 నుంచి విక్రయాలు మొదలు
- 8జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర రూ.20,999
- ఫోన్ వెనుక భాగంలో కోకకోలా బ్రాండింగ్
6.72 ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, వెనుక భాగంలో 108 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జర్, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో ఈ ఫోన్ ఉంటుంది. ఫోన్ బాక్స్ లోపల కోకకోలా కార్డ్, ఫోన్ బ్యాక్ కేస్ ఉంటాయి. ఫోన్ బాక్స్ పైనా కోకకోలా డిజైన్ కనిపిస్తుంది. రియల్ మీ 10 ప్రో కోకకోలా ఎడిషన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో ఒక్కటే వేరియంట్ గా వచ్చే దీని ధర రూ.20,999. రియల్ మీ అధికారిక వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో అయితే ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు దీని విక్రయాలు మొదలు అవుతాయి.