లోకేశ్ పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత.. లోకేశ్ పై మరో క్రిమినల్ కేసు నమోదు
- సంసిరెడ్డిపల్లిలో పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
- లోకేశ్ ఎక్కిన స్టూల్ ను లాక్కునే ప్రయత్నం చేసిన వైనం
- నర్సింగరాయపేటలో లోకేశ్ పై మరో కేసు నమోదు
మరోవైపు లోకేశ్ పై మరో క్రిమినల్ కేసు నమోదయింది. చిత్తూరు నర్సింగరాయపేట పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 341, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సమావేశాన్ని నిర్వహించారని, పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. లోకేశ్, ఇతర నేతలపై పోలీసు అధికారులే ఫిర్యాదు చేయడం గమనార్హం. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత చిత్తూరు జిల్లాలో నారా లోకేశ్ పై కేసు నమోదు కావడం ఇది ఐదోసారి. లోకేశ్ తో పాటు పులివర్తి నాని, అమరనాథ రెడ్డి, దొరబాబు, చంద్రదండు ప్రకాశ్ లపై కేసులు నమోదు చేశారు.