నారా లోకేశ్ 14వ రోజు పాదయాత్ర ప్రారంభం.. ఈనాటి షెడ్యూల్ ఇదిగో
- జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
- సాయంత్రం రంగాపురం క్రాస్ వద్ద బహిరంగ సభ
- రేణుకాపురంలో రాత్రికి బస
నారా లోకేశ్ 14వ రోజు పాదయాత్ర షెడ్యూల్:
- ఉదయం 8 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
- 8.05 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పూజలు.
- 8.25 గంటలకు మూర్తినాయకనపల్లి చర్చిలో ప్రార్థనలు.
- 9.20 గంటలకు కడపగుంట ఎస్సీ కాలనీలో ఎస్సీలతో ముఖాముఖి సమావేశం.
- 11 గంటలకు మహదేవ మంగళంలో స్థానికులతో మాటామంతీ.
- 12.35 గంటలకు సంసిరెడ్డిపల్లెలో భోజన విరామం.
- 1.35 గంటలకు సంసిరెడ్డిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
- మధ్యాహ్నం 2.25 గంటలకు జీడీ నెల్లూరు ఐజడ్ఎం స్కూలులో విద్యార్థులతో భేటీ.
- 2.55 గంటలకు అవలకొండలో కొత్తగా నిర్మించిన దర్గా ప్రారంభం.
- సాయంత్రం రంగాపురం క్రాస్ వద్ద బహిరంగసభలో ప్రసంగం.
- 6.10 గంటకు రేణుకాపురం విడిది కేంద్రంలో బస.