ఏపీ రాజధాని ఏదని గూగుల్ లో వెదికితే విశాఖనే చూపిస్తుంది: తమ్మినేని సీతారాం
- ఢిల్లీలో ఏపీ రాజధానిపై వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
- విశాఖ రాజధాని కాబోతోందని వెల్లడి
- తాను కూడా విశాఖ షిఫ్ట్ అవుతున్నట్టు ప్రకటన
- సీఎం నిర్ణయాన్ని స్వాగతించిన తమ్మినేని
రాజధానికి ఉండవలసిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని, కనెక్టివిటీ పరంగా విశాఖ అన్ని రకాలుగా అనుకూలమని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. తాను కూడా విశాఖ వచ్చేస్తున్నానని స్వయంగా జగనే చెప్పారని, పారిశ్రామికవేత్తలు సైతం విశాఖపై ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు.
నగరానికి విశాలమైన తీర ప్రాంతం ఉందని, విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ గా రూపుదిద్దుకోనుందని తెలిపారు.