ఆస్తులు కాదు.. ఆహ్లాదకర వాతావరణాన్ని ఇవ్వాలి: తలసాని
- పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న మంత్రి
- మొక్కలను నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారమవుతామని వ్యాఖ్య
- హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని ప్రశంస
హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని... ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది కోట్లాది మొక్కలను నాటుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతోందని చెప్పారు. గ్రాండ్ నర్సరీని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రశంసించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో లభించే రకరకాల మొక్కలను ఒకే చోట లభించేలా గ్రాండ్ నర్సరీని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని చెప్పారు.