70 ఏళ్లుగా మమ్మల్ని దోచుకుంటున్నారు: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
- ముస్లింలు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీల నేతలు భావిస్తుంటారన్న ఒవైసీ
- అగ్ర కులస్తులే రాజకీయాల్లో ఉండాలనే భావన పార్టీల్లో ఉందని విమర్శ
- గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని మోదీకి ప్రశ్న
గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని... గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని మోదీని ఒవైసీ ప్రశ్నించారు. గాడ్సేపై సినిమాను నిర్మిస్తున్నారని... ఈ చిత్రాన్ని ఇండియాలో మీరు బ్యాన్ చేస్తారా? లేదా? అని నిలదీశారు. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఒవైసీ ఒక విన్నపం చేశారు. నగరంలో తల్వార్లు, కత్తులతో దాడి చేస్తున్న వారిని ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. దాడులకు పాల్పడే వారికి శాశ్వతంగా బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.