విజృంభించిన భారత బౌలర్లు... న్యూజిలాండ్ 108 ఆలౌట్

Team India bowlers scalps Kiwis for 108 runs
  • రాయ్ పూర్ లో భారత్ వర్సెస్ కివీస్
  • రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
  • ఆదుకున్న బ్రేస్వెల్, ఫిలిప్స్, శాంట్నర్
  • 3 వికెట్లు తీసిన షమీ
  • రెండేసి వికెట్లు పడగొట్టిన పాండ్యా, సుందర్
బౌలింగ్ కు సహకరించిన రాయ్ పూర్ పిచ్ పై టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. రెండో వన్డేలో న్యూజిలాండ్ ను 108 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ టీమిండియా బౌలర్లు షమీ (2), సిరాజ్ (1), శార్దూల్ ఠాకూర్ (1), హార్దిక్ పాండ్యా (2), కుల్దీప్ యాదవ్ (1), వాషింగ్టన్ సుందర్ (2) వికెట్ల వేట సాగించారు. 

కివీస్ ఓ దశలో 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అయితే తొలి వన్డే సెంచరీ హీరో మైకేల్ బ్రేస్వెల్ (22), గ్లెన్ ఫిలిప్స్ (36), మిచెల్ శాంట్నర్ (27) ఆదుకోవడంతో న్యూజిలాండ్ స్కోరు కనీసం 100 అయినా దాటింది. 

ఫిన్ అలెన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 7, హెన్రీ నికోల్స్ 2, డారిల్ మిచెల్ 1, కెప్టెన్ టామ్ లాథమ్ 1, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నర్ 2 పరుగులు చేశారు. హెన్రీ షిప్లే 2 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.
Go Back to Shorts
Team India
New Zealand
Raipur
2nd ODI

More Telugu News