Rashmi Gautam: విజయ్ నాకు మంచి ఫ్రెండ్.. టూర్ కు వెళ్తే తప్పేముంది?: రష్మిక మందన్న

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటి వరకు 17 చిత్రాల్లో నటించింది. కన్నడ సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన రష్మిక టాలీవుడ్ సినిమాలతో మంచి పేరును తెచ్చుకుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ, పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని చెప్పింది. తాను స్కూల్ లో చదుకునే రోజుల్లోనే కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉందేదానినని తెలిపింది. 

తనతో పాటు హాస్టల్ లో 800 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ తనతో ఎవరూ సరిగ్గా ఉండేవారు కాదని చెప్పింది. తాను చేయని తప్పులకు కూడా మాటలు పడేదానినని... ప్రతిరోజూ గదిలో కూర్చొని ఏడ్చేదానినని తెలిపింది. అయితే తన సమస్యలన్నింటినీ అమ్మతో పంచుకోవడం తనకు అలవాటని... అదే తనను స్ట్రాంగ్ గా మార్చిందని చెప్పింది. తనకు ఇది అలవాటయిపోయిందని... అందుకే తాను ఇంత స్ట్రాంగ్ గా ఉంటానని తెలిపింది. ఇలాంటి అనుభవాలను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టే మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూనే ఉంటానని చెప్పింది. విజయ్ దేవరకొండ తనకు మంచి ఫ్రెండ్ అని.. స్నేహితులన్నాక టూర్స్ కు వెళ్లడం సహజమని తెలిపింది.
Rashmi Gautam
Tollywood
Vijay Devarakonda

More Telugu News