సిగ్గనిపించడం లేదా జగన్ రెడ్డీ?: చంద్రబాబు
- ముస్లింలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు
- ఇదెక్కడి రాజకీయం? అంటూ పెద్దిరెడ్డికి ప్రశ్న
- పీలేరు పర్యటన ఫొటోలను షేర్ చేసిన టీడీపీ అధినేత
నిన్న తన పీలేరు పర్యటన ఫొటోలను చంద్రబాబు షేర్ చేశారు. ఇటీవల ఆయన కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పీలేరు జైల్లో ఉన్న వారిని చంద్రబాబు పరామర్శించారు.