nepal flight accident: నేపాల్ విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. వీడియో ఇదిగో!

Nepal Crash Captured By Indian Passenger
షార్ట్స్‌లో చూడండి
నేపాల్ లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తీసిన ఈ వీడియోలో విమానం ల్యాండింగ్ ద‌ృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానంలోని భారతీయ ప్రయాణికుడు ఒకరు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. పొఖారా ఎయిర్ పోర్టు సమీపంలోకి చేరుకున్న ఫ్లైట్.. కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది.. మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోయారు.

విమానం కూలిపోవడంతో అలర్ట్ అయిన అధికారులు ప్రయాణికులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ప్రయాణికులు అందరూ సజీవ దహనమయ్యారు. రెస్క్యూ పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి ఓ మొబైల్ ఫోన్ దొరికింది. అందులో విమాన ప్రమాదానికి ముందు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు, ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన విమానం నేలవైపు దూసుకురావడాన్ని నేపాలీ పౌరుడు ఒకరు వీడియో తీశాడు. ఓ బిల్డింగ్ పై నుంచి తీసిన ఈ వీడియోలో యతి ఎయిర్ లైన్స్ విమానం కూలిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
Go Back to Shorts
nepal flight accident
flight
pokhara
last minute vedeo
passenger

More Telugu News