కరోనా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించాల్సిన సమయం ఇది.. నిపుణులు
- దీర్ఘకాలిక వ్యాధులున్న వారికే కరోనా టీకాలు ఇవ్వాలని సూచన
- ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికి సహజ రక్షణ ఉంటుందని వెల్లడి
- ప్రజారోగ్య సదుపాయాల బలోపేతంపై నిధులు వెచ్చించాలని సూచన
కరోనా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించాల్సిన సమయం ఇదంటూ సూచించింది. అదే సమయంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు, టీకాల తయారీ పరిశ్రమ కరోనా వంటి వ్యాధుల సమయంలో.. ప్రజారోగ్య నిపుణులు, శాస్త్రవేత్తల మాదిరి వ్యవహరించడాన్ని అడ్డుకునేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది.
అనవసర, అసాధారణంగా కరోనా టీకాలను వాడడం వల్ల ఇతర ప్రజారోగ్య కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన వనరులను అనవసరంగా మళ్లించినట్టు అవుతుందని ఈ టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది. అనవసర టీకాలను నిరోధించడం ద్వారా వనరులను కాపాడుకోవచ్చని పేర్కొంది. దీనికి బదులు ప్రజారోగ్య సదుపాయాల బలోపేతంపై దృష్టి పెట్టాలని, అలా చేయడం వల్ల ప్రస్తుత సంక్షోభంతో పాటు, భవిష్యత్తులో తలెత్తే ఈ తరహా సంక్షోభాలకు సన్నద్ధత పెరుగుతుందని సూచించింది. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడెమాలజిస్ట్స్ ఈ టాస్క్ ఫోర్స్ లో భాగంగా ఉన్నాయి.