Advertisement

పోలీసులు ఇచ్చిన టీ నిరాకరించిన అఖిలేశ్ యాదవ్... ఎందుకంటే...!

Akhilesh Yadav denies tea offered by police
  • సమాజ్ వాదీ కార్యకర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
  • పోలీసు కార్యాలయం ఎదుట అఖిలేశ్ నిరసన
  • టీ ఇచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులు
  • విషం కలిపి ఉంటారేమో అంటూ నిరాకరించిన అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్ ను నేడు అరెస్ట్ చేయగా, పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్నోలో పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు... అఖిలేశ్ యాదవ్ కు టీ ఇవ్వడానికి వెళ్లారు. 

అయితే పోలీసులు ఇచ్చిన టీ తాగేందుకు అఖిలేశ్ యాదవ్ అంగీకరించలేదు. ఒకవేళ మీరు దీంట్లో ఏదైనా విషం కలిపి ఉంటే...? అంటూ సందేహం వ్యక్తం చేశారు. నేను ఈ టీ తాగను... మిమ్మల్ని ఎలా నమ్మగలను? అంటూ అఖిలేశ్ ఆ టీ నిరాకరించారు.
Advertisement
Akhilesh Yadav
Tea
Police
Samajwadi Party
Uttar Pradesh

More Telugu News