గీతం వైద్య కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు

06-01-2023 Fri 10:10 | Andhra
Advertisement
  • తెల్లవారుజామునే చేరుకున్న రెవెన్యూ అధికారులు
  • స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ కంచె
  • ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్ల ఏర్పాటు
  • మీడియాను కూడా అనుమతించని పోలీసులు
  • కక్ష సాధింపు చర్యగా పేర్కొన్న ‘గీతం’ యాజమాన్యం
Advertisement
విశాఖపట్టణంలోని గీతం మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది దాని చుట్టూ కంచె వేశారు. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పోలీసులను భారీగా మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు. మీడియాను కూడా కళాశాలలోకి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాజా పరిణామాలపై స్పందించిన గీతం యూనివర్సిటీ యాజమాన్యం.. దీనిని ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా ఆరోపించింది.

మరోవైపు, భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామని, నేడు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని 5.25 ఎకరాల్లో కంచె వేసినట్టు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న భూమిలో పది చోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టినట్టు చెప్పారు. కంచె పనులు త్వరగా పూర్తవ్వాలన్న ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచే పనలు ప్రారంభించినట్టు చెప్పారు.

Advertisement
GITAM UniversityVisakhapatnamGitam College Ground

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more