కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌పై సోదరుడు సుదర్శన్ తీవ్ర ఆరోపణలు

06-01-2023 Fri 08:39 | Andhra
Advertisement
  • టీడీపీ నేత విష్ణువర్ధన్‌ను కలిసిన జె.సుదర్శన్
  • సోదరుడు సుధాకర్‌ను నమ్మక ద్రోహిగా అభివర్ణించిన వైనం
  • కోడుమూరు ప్రజలనే కాకుండా కుటుంబ సభ్యులను కూడా మోసం చేశాడన్న సుదర్శన్
  • ఆయన గెలుపు కోసం రూ. 30 లక్షలు ఖర్చు చేశానని వెల్లడి
  • ఆ డబ్బులు అడుగుతాననే దూరం పెట్టాడని ఆరోపణ
Advertisement
కోడుమూరు ఎమ్మెల్యే జె.సుధాకర్‌పై ఆయన సోదరుడు జె.సుదర్శన్ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సీనియర్ నేత విష్ణువర్ధన్‌రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. సోదరుడిపై విరుచుకుపడ్డారు. సుధాకర్‌ను నమ్మకద్రోహిగా అభివర్ణించారు. ఆయనకు స్వప్రయోజనాలు తప్ప మరేవీ పట్టవన్నారు. ఆయనను నమ్మి కోడుమూరు ప్రజలే కాకుండా కుటుంబ సభ్యులం కూడా మోసపోయామన్నారు. సుధాకర్ తనకు స్వయానా తమ్ముడని, మూడు దశాబ్దాలపాటు తామిద్దరం టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి అనుచరులుగా ఉన్నామన్నారు. 

డాక్టర్ చదివిన తన సోదరుడు స్థిరాస్తి వ్యాపారంలో బాగా సంపాదించి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి కోడుమూరు టికెట్ సంపాదించుకున్నారని గుర్తు చేశారు. దీంతో తాము కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరామన్నారు. ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డామన్నారు. సోదరుడి గెలుపు కోసం తాను స్వయంగా రూ. 30 లక్షలు ఖర్చు చేశానని, ఆ డబ్బులు అడుగుతానని ఇప్పుడు తనను దూరం పెట్టాడని ఆరోపించారు. 

చివరికి తన ఆఖరు కుమార్తె పెళ్లికి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసకారిని తన జీవితంలోనే చూడలేదన్నారు. ఏడాది క్రితం హైదరాబాద్‌లో పత్తికొండ నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు కేఈ శ్యాంబాబు సమక్షంలో టీడీపీలో చేరినట్టు చెప్పిన ఆయన కోడుమూరు టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి గెలుపు కోసం కృషి చేస్తామని సుదర్శన్ తెలిపారు.
Advertisement
KodumurKurnool DistrictTDPYSRCPJ.SudarshanJ.Sudhakar

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more