‘పాప్ కార్న్’ను తెలుగు ఆడియెన్స్ పెద్ద హిట్ చేస్తారనే నమ్మకం ఉంది: నాగార్జున
- అవికా గోర్ నాయికగా రూపొందిన 'పాప్ కార్న్'
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన లవ్ స్టోరీ
- నాగ్ చేతుల మీదుగా జరిగిన ట్రైలర్ లాంచ్
- అవికా పాన్ వరల్డ్ స్టార్ అంటూ కితాబు
- ఆయనకి థ్యాంక్స్ చెప్పిన అవికా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'పాప్‌కార్న్’ మూవీ నిర్మాతలు చలపతిరాజు, భోగేంద్ర గుప్తాగారికి .. లిఫ్ట్ లో సాంగ్ కొరియోగ్రఫీ చేసిన అజయ్‌కి అభినందనలు. డైరెక్టర్ మురళి టెన్షన్ పడనక్కర్లేదు. సినిమా డిఫరెంట్‌గా ఉంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. అలాగే హీరో సాయిరోనక్ కి ఆల్ ది బెస్ట్. నేను పదేళ్ల ముందు బ్రెజిల్లో రియో సిటీకి ఓ స్టూడియో చూద్దామని వెళ్లాను. అక్కడ అవికాగోర్ ముఖాన్ని చూశాను. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ అక్కడ సూపర్ డూపర్ హిట్ అని చెప్పారు" అన్నారు.
128 దేశాల్లో 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌ను డబ్ చేశారని తెలిసింది. అవికా గోర్ పాన్ ఇండియా కాదు .. పాన్ వరల్డ్ స్టార్. కజికిస్థాన్లోనూ రెండు సినిమాలు చేసింది. మా టీవీలో ప్రసారమైన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ టాప్‌గా నిలిచింది. అప్పుడు నాకు అవికా గోర్ పరిచయం. దాని తర్వాత 'ఉయ్యాలా జంపాలా' సినిమాను రామ్మోహన్గారితో కలిసి నిర్మించాం. అవికా గోర్ హీరోయిన్ మాత్రమే కాదు .. నిర్మాత కూడా అయ్యింది. 'పాప్ కార్న్' సినిమాను పెద్ద హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
అవికా గోర్ మాట్లాడుతూ ‘‘తెలుగులో నా ఫస్ట్ ఫిల్మ్ అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే ప్రారంభమైంది. ఆ సినిమాతో నాగార్జునగారితో పరిచయం ఏర్పడింది. నాకు .. రాజ్ తరుణ్‌కి తొలి సినిమా. అయితే మా కాన్ఫిడెన్స్ ఎక్కడా దెబ్బ తినకూడదని ఆయన ఎప్పుడూ మా వెంటే ఉండేవారు. మంచి నిర్మాతే కాదు.. మంచి మనిషి కూడా. మా సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను" అంటూ ముగించింది.