పంత్ కారు ప్రమాదం జరిగిందిలా.. వీడియో ఇదిగో!
- టోల్ గేట్ దగ్గర సీసీటీవీ కెమెరా ఫుటేజీలో ప్రమాద దృశ్యాలు
- వేగంగా దూసుకొచ్చి ఫుట్ పాత్ ను ఢీ కొట్టిన పంత్ మెర్సిడెస్ కారు
- మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయిన కారు
వేగంగా దూసుకొచ్చిన పంత్ కారు డివైడర్ ను ఢీ కొట్టుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆపై మంటల్లో తగలబడుతున్న కారును అక్కడి వాహనదారులు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో మంటల్లో కాలిపోతున్న పంత్ కారు, గాయపడిన పంత్ కు స్థానికులు సాయంచేస్తున్న దృశ్యాలు ఉన్నాయి.