అన్నాడీఎంకే పార్టీలోని వారందరూ నాకు కావాలి: శశికళ
- చికిత్స కోసం విదేశాలకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని వైద్యులకు జయ చెప్పారన్న శశికళ
- అన్నాడీఎంకేలో అందరినీ ఏకం చేసే పనిలో ఉన్నానని వ్యాఖ్య
- కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేయనని హామీ
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నాడీఎంకే పార్టీలోని అందరూ తనకు కావాలని ఆమె చెప్పారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలలో ఎవరికీ తాను మద్దతుగా కానీ, వ్యతిరేకంగా కానీ లేనని... అందరూ తనకు కావాల్సిన వాళ్లే అని అన్నారు. పార్టీలో అందరినీ ఏకం చేసే పనిలో తాను ఉన్నానని వెల్లడించారు. తాను ఉన్నంత వరకు పార్టీలో ఏ ఒక్క కార్యకర్త నిరుత్సాహానికి గురికారని చెప్పారు.