నాటా తెలుగు మహాసభలకు సీఎం జగన్ కు ఆహ్వానం
- వచ్చే ఏడాది జూన్ 30 నుంచి నాటా తెలుగు మహాసభలు
- సీఎం జగన్ ను కలిసిన నాటా కార్యవర్గం
- పేరుపేరునా పలకరించిన సీఎం
- శాలువా కప్పి ఇన్విటేషన్ కార్డు అందించిన నాటా సభ్యులు
నాటా తెలుగు మహాసభలు 2023 జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు అమెరికాలోని డాలస్ లో జరగనున్నాయి. ఈ మహాసభలకు డాలస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలవనుంది.
కాగా, తనను కలిసిన నాటా కార్యవర్గాన్ని సీఎం జగన్ పేరుపేరునా పలకరించారు. ఈ సందర్భంగా నాటా సభ్యులు సీఎం జగన్ కు శాలువా కప్పి సన్మానించారు. తెలుగు మహాసభల ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.