బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి దూరంగా కేటీఆర్

KTR away from BRS office opening ceremony
  • ఢిల్లీలో నేడు బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం
  • హైదరాబాద్ లోనే ఉన్న కేటీఆర్
  • జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్ తో కేటీఆర్ సమావేశం
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. పార్టీ జెండాను ఎగురవేసి, జాతీయ విధానాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరుకావడం లేదు. ఇప్పటికే ఖరారైన అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉంటున్నట్టు సమాచారం. 

జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్ తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పార్టీ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నట్టు సమాచారం. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు హాజరుకానున్నారు.
Go Back to Shorts
KTR
TRS
BRS

More Telugu News