Rashmika Mandanna: నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న రష్మిక సినిమా

Rashmika Bollywood movie Mission Majnu to be released directly in OTT
షార్ట్స్‌లో చూడండి
దక్షిణాదిలో స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతున్న రష్మిక... బాలీవుడ్ లో సైతం ఎంట్రీ ఇచ్చింది. 'మిషన్ మజ్ను' సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక నటించింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 20న నేరుగా ఓటీటీలో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. 

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. 1970ల నాటి కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో రా ఏజెంట్ గా సిద్ధార్ కనిపించనున్నాడు. శాంతను బగ్చీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గరిమా మెహతా, అమర్ బుటాలా, రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Go Back to Shorts
Rashmika Mandanna
Bollywood
Mission Majnu Movie
Release
OTT

More Telugu News