భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ రాజుకున్న ఘర్షణలు... సైనికులకు గాయాలు
- ఈ నెల 9న ఘటన
- వాస్తవాధీన రేఖ దాటేందుకు చైనా దళాల యత్నం
- సమర్థంగా అడ్డుకున్న భారత బలగాలు
- అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్లో ఘటన
కాగా, భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవాధీన రేఖ దాటేందుకు చైనా దళాలు యత్నించగా, భారత సైనికులు సమర్థంగా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణలు రాజుకున్నాయి. ఈ ఘటనలో భారత్, చైనా సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన డిసెంబరు 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చోటుచేసుకుంది.
దీనిపై భారత్, చైనా రక్షణ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఇరుదేశాల కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశాయి. సరిహద్దుల్లో శాంతి, సామరస్య పునరుద్ధరణకు చర్యలు చేపట్టాయి.