మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు.. ఈసారి 91 సీఆర్పీసీ కింద నోటీసులు!
- నిన్న ఏడున్నర గంటల సేపు కవితను ప్రశ్నించిన సీబీఐ అధికారులు
- తాము చెప్పిన చోటుకు రావాలంటూ సీబీఐ మరోసారి నోటీసులు
- విచారణ తేదీ, స్థలాన్ని మెయిల్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్న సీబీఐ
తాము చెప్పిన చోటుకు వచ్చి విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఇచ్చిన సీఆర్పీసీ 91 నోటీసుల్లో కవితను సీబీఐ అధికారులు కోరారు. తాము అడిగిన పత్రాలను విచారణకు తీసుకురావాలని చెప్పారు. కేసుకు సంబంధించి మరింత సమాచారం కావాలని... తాము అడిగిన పత్రాలను, సాక్ష్యాలను ఇవ్వాలని ఆదేశించారు. విచారణ తేదీ, స్థలాన్ని త్వరలోనే మెయిల్ చేస్తామని చెప్పారు.
మరోవైపు, నిన్న ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లారు. వీరిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు కవిత ఇంటి నుంచి సీబీఐ అధికారులు వెళ్లిపోయారు.